రాజ్యసభ సభ్యునిగా కమల్ హాసన్ ప్రమాణస్వీకారం

డీఎంకే మద్దతుతో రాజ్యసభలోకి అడుగుపెట్టిన MNM వ్యవస్థాపకుడు - తమిళ్ భాషలో ప్రమాణం చేసి తమ పౌరస్పూర్తిని చాటిన కమల్;

Update: 2025-07-26 03:28 GMT

భారతీయ సినీ పరిశ్రమలో ఆల్ టైమ్ బెస్ట్ యాక్టర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు లోక నాయకుడు కమల్ హాసన్. ఆయన బాలనటుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించారు. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్నారు. తరువాత నటుడిగా ఇంకో మూడు సార్లు నేషనల్ అవార్డులు గెలుచుకోవడం ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్నారు.కేవలం నటుడిగా కాకుండా కమల్ హాసన్ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, పాటల రచయిత, నృత్య దర్శకుడు, మేకప్ ఆర్టిస్ట్‌గానూ పని చేశారు. ఆయన టాలెంట్ అనేక రంగాల్లో కనిపిస్తుంది.కమల్ తమిళంలో స్టార్ హీరో అయినా తెలుగు, హిందీ సహా ఇతర భాషల్లోనూ ఆయనకి మంచి క్రేజ్ ఉంది.

2018లో కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చారు. 'మక్కల్ నీది మయ్యం' (MNM) అనే పార్టీని స్థాపించారు.2021 ఎన్నికల్లో కమల్ హాసన్ తన పార్టీ మక్కల్ నీది మయ్యం తరఫున కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 1728 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఇప్పుడు తాజాగా కమల్ హాసన్ డీఎంకే మద్దతుతో రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జూలై 25, 2025న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి. ఈ సందర్భంలో కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తమిళ భాషలో ప్రమాణం చేయడం ప్రత్యేకతగా మారింది. డీఎంకే నుంచి పి. విల్సన్, సల్మా, ఎస్.ఆర్. శివలింగం కూడా ప్రమాణం చేశారు.

కమల్ హాసన్ కుమార్తెలు శ్రుతి హాసన్, అక్షర హాసన్‌లు కూడా సినీ రంగంలో నటిస్తున్నారు. శ్రుతి హాసన్ ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో స్టార్ హీరోయిన్‌గా పేరు పొందింది. అక్షర హాసన్ కూడా విభిన్న పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంటోంది.

తాజాగా కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన సినిమా "థగ్ లైఫ్". గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్‌లో రూపొందిన ఈ చిత్రం జూన్ 5, 2025న విడుదలైంది. ఇందులో శింబు, త్రిష, అభిరామి నటించారు. అయితే భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచలేకపోయింది.

కమల్ హాసన్ రాజకీయాల్లో రాణిస్తూనే సినిమాలు కూడా చేస్తున్నారు. ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Tags:    

Similar News