విశాఖలో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ నూతన క్యాంపస్
సుమారు ఎనిమిది వేల ముందుకి ఉద్యోగాలు వచ్చే అవకాశం;
ఆంధ్రరాష్ట్ర విభజన తరువాత నాటి చంద్రబాబు ప్రభుత్వం విశాఖని ఐటీ హబ్ గా ప్రకటించారు.తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐటీ కంపెనీలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు.మరలా కూటమి ప్రభుత్వం ఎర్పాటు అయినా తరువాత విశాఖకు ఐటీ పరిశ్రమను చేయటానికి మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలు మొదలు పెట్టారు.ఇటీవల జరిగిన కాబినెట్ సమావేశంలో 11 కొత్త సంస్థలకు భూకేటాయంపు ఆమోదం తెలిపింది.
ఐటీ సంస్థ కగ్నిజెంట్ కు విశాఖ కాపులుప్పాడలో 22 ఎకరాల భూకేటాయంపు చేసింది.కగ్నిజెంట్ విశాఖలో తన నూతన ఐటీ క్యాంపస్ స్థాపించబోతున్నట్టు ట్వీట్ చేసింది.విశాఖ కాపులుప్పాడలో 22 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.సుమారు ఎనిమిది వేలమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ట్వీట్‍లో కాగ్నిజెంట్ వెల్లడించింది. ఏఐ, డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ రంగంలో ఉద్యోగాలు లభిస్తాయని, 2026 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామని కాగ్నిజెంట్ ట్వీట్ ద్వారా తెలియచేసింది.2029 నాటికి ఐటీ క్యాంపస్ తొలిదశ పనులు పూర్తిచేస్తామని కాగ్నిజెంట్ ప్రకటించింది.సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‍కు కృతజ్ఞతలు తెలిపారు కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్.