మణిపూర్‌లో భారీ ఆయుధ స్వాధీనం: 203 ఆయుధాలు పట్టివేత

మణిపూర్‌లో భద్రతా బలగాల దాడి: పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాల స్వాధీనం;

Update: 2025-07-04 14:41 GMT

మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న తనిఖీ ఆపరేషన్‌ల్లో భాగంగా భద్రతా దళాలు కీలక విజయాన్ని సాధించాయి. ఈ ఆపరేషన్‌లో మొత్తం 203 ఆయుధాలు, రైఫిల్లు, పిస్టల్స్ సహా స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలతో పాటు ఐఈడీలు, గ్రెనేడ్లు, ఇతర పేలుడు పదార్థాలు కూడ సీజ్ చేయబడ్డాయి.

ఇది ఇటీవల నెలకొన్న జాతివివాదాల నేపథ్యంలో హింసను తగ్గించడానికి, శాంతిని పునరుద్ధరించడానికి పెద్ద ముందడుగు అని అధికారులు పేర్కొన్నారు. ఈ ఆయుధాలు ఇటీవల జరిగిన ఘర్షణలు మరియు అక్రమ కార్యకలాపాలలో ఉపయోగించబడ్డవని అనుమానం వ్యక్తం చేశారు.ప్రస్తుతానికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News