న్యూయార్క్‌లో భయానక కాల్పులు – ఐదుగురు మృతి

అగ్రరాజ్యంలో శాంతికి గండికొడుతున్న ఘాతుక ఘటనలు - మానసిక సమస్యలతో బాధపడుతున్న యువకుడి దుర్మార్గమైన చర్య;

Update: 2025-07-29 13:07 GMT

అమెరికా ప్రపంచంలో ఎంత అగ్రరాజ్యం అయినా శాంతియుత దేశంగా ఎప్పుడూ వెనకపుడే ఉంటుంది,అక్కడ జరుగుతున్న క్రైమ్ ను మాత్రం ఆ దేశం పూర్తిగా నిరోధించలేక పోతుంది.యూస్ లో ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో భయానకమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.

న్యూయార్క్‌లోని మిడ్‌టౌన్ మ్యాన్హాటన్ ప్రాంతంలో జూలై 28 సాయంత్రం ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. ఇందులో ఒకరు పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. ఇది న్యూయార్క్ నగరాన్ని షాక్‌కు గురిచేసింది.

ఈ కాల్పుల్లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఐదో వ్యక్తి గా కాల్పుల దాడి చేసిన వ్యక్తి తనను తానే కాల్చుకుని చనిపోయాడు. మృతుల్లో NYPDకి చెందిన పోలీస్ ఆఫీసర్ దిదారుల్ ఇస్లాం కూడా ఉన్నారు. ఆయన ఆ రోజు సెలవులో ఉన్నారు.ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతను కూడా ఆ భవనంలో పనిచేసే ఉద్యోగి.

కాల్పులు చేసిన వ్యక్తి పేరు షేన్ టమురా. వయసు 27 సంవత్సరాలు. అతను లాస్ వేగాస్‌కి చెందినవాడు. తన వద్ద ఉన్న భారీ తుపాకితో (M4 రైఫిల్) న్యూయార్క్‌కి వచ్చి ఈ ఘోర చర్యకు పాల్పడ్డాడు. అతనికి మానసిక సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆత్మహత్య చేసికొన్న ఆ దుండగుని దగ్గర ఒక లెటర్ను పోలీసలు స్వాధీనం చేసుకున్నారు, అందులో తలనొప్పులు, ఆరోగ్య సమస్యల గురించి ఉంది తెలిసింది.

ఈ దాడి 345 పార్క్ అవెన్యూలోని ఒక పెద్ద బహుళ అంతస్థుల భవనంలో జరిగింది. అక్కడ NFL, KPMG, Blackstone వంటి ప్రముఖ సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. కాల్పులు జరిగిన సమయంలో అక్కడ చాలా మంది ఉద్యోగులు ఉండడం వల్ల భయ ఆందోళన వాతావరణంనెలకొంది.అక్కడ ఉన్నవారు అంతా ఒక్కసారిగా భయటకు పరుగులు తీశారు.

NYPD అధికారులు, FBI సహా అనేక ఏజెన్సీలు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాయి. సీసీ కెమెరాలు, ఆ వ్యక్తి రాసిన లేఖ తదితర ఆధారాల ఆధారంగా మోటివ్ (ఉద్దేశ్యం) తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దాడి వెనుక అసలు కారణం ఇంకా తెలియాల్సి ఉంది.

పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటనగా అధికారులు అభివర్ణించారు.

Tags:    

Similar News