చందానగర్ లో ఖజానా జ్యువెలరీలో కాల్పులు
లాకర్ కీ ఇవ్వనందుకు మేనేజర్‌పై రెండు రౌండ్ల కాల్పులు - కాలు గాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ మేనేజర్;
హైదరాబాద్ నగరంలోని చందానగర్ లో ఈరోజు ఉదయం ఖజానా జ్యువెలరీ షాపులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. దాదాపు ఆరుగురు దొంగలు ఆయుధాలతో అక్కడికి చేరుకుని, లోపలికి దూసుకెళ్లారు.దొంగలు లోపలికి వెళ్లిన వెంటనే డిప్యూటీ మేనేజర్‌పై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆయన కాలుకి గాయాలు అయినప్పటికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. గాయపడిన ఆయనను తక్షణమే ఆసుపత్రికి తరలించారు.తొలుత లాకర్ కీ అడిగిన దుండగులు సిబంది నిరాకరించడం తో మేనేజర్ పై కాల్పులు జరిపారు.లోపల బంగారం ఆభరణాల స్టాల్స్ విరగొట్టి సిబ్బందిపై దాడులు చేసినట్టు తెలుస్తుంది.
దోపిడీ తర్వాత దొంగలు వాహనంలో అక్కడి నుంచి తప్పించుకున్నారు. వారు జహీరాబాద్ వైపు పారిపోయారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై స్పందించిన పోలీసులు, వెంటనే 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.చెక్‌పాయింట్ల వద్ద కఠినమైన తనిఖీలు జరుగుతున్నాయి. సిసిటివీ ఫుటేజ్‌ను సేకరించి, నిందితుల కదలికలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటన అనంతరం నగరంలోని ఇతర ఆభరణాల దుకాణాలకు కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం షాపులు తెరిచే సమయాల్లో భద్రతా చర్యలు మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు.