అనిల్ అంబానీపై ఈడీ దాడులు! - 3000 కోట్ల మోసం
3,000 కోట్ల రుణ మోసం: Yes Bank తో అనిల్ అంబానీని సంభంధించిన అక్రమాలపై విచారణ;
ఈ రోజు (2025 జూలై 25న), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ పై భారీ దాడులు చేపట్టింది. తాజా దాడులు, దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. అనిల్ అంబానీకి చెందిన సంస్థలపై ఆర్థిక మోసం, పన్నుల అవకతవకలు, మనీ లాండరింగ్ మరియు అక్రమ లావాదేవీల ఆరోపణలు వేయబడిన నేపథ్యంలో ఈ దాడులు చోటు చేసుకున్నాయి. అనిల్ అంబానీతో పాటు, ఆయన రీల్లయన్స్ గ్రూప్, డీల్‌మోర్ సంస్థలపై కూడా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ దాడులు 3,000 కోట్ల లోన్ మోసం ఆరోపణలపై జరుగుతున్నాయి. ఈ మోసం Yes Bank కు సంబంధించినదిగా ఉంది.
ఈడీ చేసిన విచారణలో, అనిల్ అంబానీకి చెందిన సంస్థలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో లోన్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ, ఈ లోన్లను తిరిగి చెల్లించడంలో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ లోన్ల వాడకం, దోపిడీ, మరియు రిలయెన్స్ సంస్థల ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలపై క్షుణంగా దర్యాప్తు జరుగుతోంది.
ఈడీ 35 ప్రదేశాలు, 50 కంపెనీలు, మరియు 25 వ్యక్తులపై దాడులు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద ఈ దాడులు జరిగాయి. ఈ దాడులలో, 2017 - 2019 మధ్య 3,000 కోట్ల రూపాయలను డైవర్ట్ చేయడానికి ఉపయోగించిన పథకం ఒకటి వెలుగులోకి వచ్చింది.ఈ లోన్ విడుదల ముందు, Yes Bank ప్రోత్సాహకుల వ్యక్తిగత ఖాతాలకు అప్పు మరికొన్ని కాంట్రాక్ట్‌లను బ్యాక్ ను తప్పుదారి చేయడం మరియు ఆర్థిక లావాదేవీలలో లోపాలు సైతం చోటు చేసుకున్నట్లు ఈడీ భావిస్తుంది.ఈ వివాదం 2020 లో మొదలైంది. అప్పటి Yes Bank ప్రోత్సాహకులు, రాణా కపూర్, అనిల్ అంబానీ సంస్థలతో సంభందం ఉన్న 9 కంపెనీల 13,000 కోట్ల లోన్ తో మనీ లాండరింగ్ ఆరోపణలు వచ్చాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCom) మరియు సంబంధిత సంస్థలు "ఫ్రాడ్" గా గుర్తించారు. ఈ సంస్థలు రుణం కోసం తీసుకున్న ₹31,500 కోట్లలో ₹6,265 కోట్లను అక్రమంగా డైవర్ట్ చేశాయని ఫోరెన్సిక్ ఆడిట్ వెల్లడించింది.
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCom) వాదనల ప్రకారం, IBC (ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్) సెక్షన్ 32A కింద, వారు పది సంవత్సరాల తరువాతి కేటగిరీల్లో ఆర్ధిక లావాదేవీలను స్వతంత్రంగా ఎదుర్కొనేందుకు తగిన ముందు ఆలోచనగా పరిగణలోకి తీసుకోవాలని వాదించారు.
ఈడీ ప్రస్తుతం మనీ లాండరింగ్ సంబంధించి, సంబంధిత సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటోంది అని భావిస్తున్నారు. సీబీఐ, ఎన్‌హెచ్‌బీ, సెబీ, ఎఫ్‌ఆర్‌ఏ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ఇతర రెగ్యులేటరీ సంస్థలు ఈ విచారణలో ఈడీకి సహాయం చేస్తున్నాయి.
ఈ 3,000 కోట్ల రుణ మోసం కేసు Yes Bank దర్యాప్తులో ఒక ముఖ్యమైన దశను సూచిస్తోంది. ఇలాంటి కేసులు RBI యొక్క నూతన నిబంధనలు, ఫ్రాడ్ రిపోర్టింగ్ మార్గదర్శకాలను మరింత కఠినంగా అమలు చేయవలసిన భాద్యత RBI కి ఎంతయినా ఉంది.