కవిత వ్యాఖ్యలతో బిఆర్ఎస్‌లో కలవరం

ఆర్డినెన్స్ సరైంది – కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయానికి కవిత పూర్తి మద్దతు;

Update: 2025-07-17 11:16 GMT

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు,ప్రస్తుత పరిస్థితులలో పరిపాలనలో స్పష్టత అవసరం అన్నారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ సరైన దిశలో ముందడుగు వేస్తుంది అన్నారు. ఇది చట్టబద్ధంగా, ప్రజాస్వామ్య పరంగా సబబైన నిర్ణయంగా భావిస్తున్నట్టు తెలియ చేసారు కవిత. 2018లో చేసిన చట్టసవరణను ఆధారంగా చేసుకుని ఇప్పుడు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పూర్తిగా సమర్థనీయంగా ఉంది అని వివరించారు.

బిఆర్ఎస్ నేతలు ఆర్డినెన్స్ వద్దని చెబుతుండటం పూర్తిగా అవాస్తవం అని. ప్రజల మద్దతు లేకుండా, ప్రజాస్వామ్యాన్ని తుడిచిపెట్టే ప్రయత్నమే లేదని, బిఆర్ఎస్ నాయకత్వం నా దారిలో రావాల్సిందేనని,ఇది సమాజ ప్రయోజనాలను ముందుంచే చట్టపరమైన చర్య భావించి మద్దతు పలకాలి అన్నారు కవిత.

నాలుగు రోజులు టైం తీసుకోవచ్చు – కానీ చివరికి నిజం గెలుస్తుంది, నేను న్యాయనిపుణులతో సంప్రదించిన తర్వాతే ఈ ఆర్డినెన్స్‌కు మద్దతు ప్రకటించాను అని తెలియచేసారు. ఇది వ్యక్తిగత నిర్ణయం కాదు, ప్రజల ప్రయోజనాల కోసం తీసుకున్న మద్దతుగా భావిస్తున్నాను అన్నారు ఎమ్మెల్సీ కవిత.

ప్రజాస్వామ్య పరిరక్షణకు, చట్టపరమైన స్పష్టతకు – మా మద్దతు ఉన్నది అధికార ప్రభుత్వానికే అని కాంగ్రెస్ ప్రతిపాదించిన నిర్ణయాన్ని సమర్ధించారు.అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ కవిత మాట్లాడిన మాటలు బిఆర్ఎస్ శ్రేణుల్ని కలవర పరుస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీ అంటేనే విరుచుకు పడే బిఆర్ఎస్ శ్రేణులు పార్టీ లోని ముఖ్య నాయకులే ఎలా మాట్లాడటం బిఆర్ఎస్ కార్యకర్తలను కొంచం కలవర పెట్టె అంశంగా భావిస్తున్నారు కారు పార్టీ నాయకులు.

Tags:    

Similar News