వాతావరణం ప్రభావంతో సీఎం చంద్రబాబు హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

ప్రమాద నివారణలో పైలట్ అప్రమత్తత – సీఎం ప్రయాణానికి తాత్కాలిక మార్పులు;

Update: 2025-07-01 08:13 GMT

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. పైలట్‌ అప్రమత్తతతో సమయోచితంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

హెలికాప్టర్ మార్గం కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో, సీఎం గన్నవరం నుంచి ప్రత్యక్ష విమానంలో రాజమండ్రికి చేరుకున్నారు.రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో మలకపల్లి చేరుకోనున్నారు. సీఎం భద్రతా బలగాలు, అధికారులు ఇప్పటికే మలకపల్లిలో ఏర్పాట్లు పూర్తి చేశారు.

Tags:    

Similar News