కుప్పం ఆస్పత్రిలో డీజీ నెర్వ్ సెంటర్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

శవ రాజకీయాలపై చంద్రబాబు మండిపాటు – రైతుల గురించి ఎవరు పట్టించుకోలేదు;

Update: 2025-07-03 08:04 GMT

ఈరోజు సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా ,కుప్పం ఏరియా ఆస్పత్రిలో టాటా భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన డీజీ నెర్వ్ సెంటర్‌ను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, వైద్యారోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా నెర్వ్ సెంటర్ల సేవల గురించి సీఎం అడిగిన ప్రశ్నలకు వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు సమాధానమిస్తూ, ఇలాంటి సేవల విస్తరణకు అదనంగా 2,000 మంది సిబ్బంది అవసరం ఉంటుందని తెలిపారు.పిహెచ్సీల స్థాయిలో డీజీ నెర్వ్ సెంటర్ల సేవలను ఎలా అందిస్తున్నారన్న అంశాన్ని వర్చువల్‌గా పర్యవేక్షించిన చంద్రబాబు, వైద్య నిపుణులతో రోగుల కన్సల్టేషన్‌ సేవలపై సమీక్ష జరిపారు. డీజీ నెర్వ్ సెంటర్ సిబ్బందితో ముఖాముఖీ మాట్లాడారు.

మామిడి రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,మామిడి రైతులకు మేము చేసినంత సాయం గతంలో ఎవరైనా ఇచ్చారా..? శవ రాజకీయాలు చేసే వారు ఇప్పుడు రైతులపై ప్రేమ కురిపిస్తున్నారు అని తీవ్రంగా విమర్శించారు.అలాగే, రైతులను ఇబ్బందుల్లోకి నెట్టిన సిండికేట్ వ్యవహారాన్ని సెట్ చేయనున్నట్లు తెలిపారు.వ్యవసాయం, హార్టీకల్చర్ మీద కనీసం పట్టించుకోని వారు ఇప్పుడు మాటలు చెబుతున్నారు. మేమే హంద్రీనీవా పనులను ప్రారంభించాం. ఏడాదిలోనే రూ.3,980 కోట్ల ఖర్చుతో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తున్నాం, మైక్రో సబ్సిడీలు ఇచ్చాం అని చంద్రబాబు గుర్తు చేసారు. 

Tags:    

Similar News