సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు పెట్టుబడులపై చర్చలు

ఏపీలో ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్న ఎవర్సెండై - విశాఖ లేదా కృష్ణపట్నంలో 2 లక్షల చ.మీ విస్తీర్ణంలో యూనిట్ ప్రతిపాదన;

Update: 2025-07-27 12:57 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐదు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా పలు అంతర్జాతీయ కంపెనీలతో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో ఆయనతోపాటు మంత్రులు నారా లోకేష్, టీజీ భారత, పి. నారాయణలతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. మొత్తం 29 కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం.. సింగపూర్‌లోని ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థలతో పెట్టుబడులపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడుల‌ను ఆకర్షించడం ముఖ్యమని తెలియచేసారు.

సింగపూర్‌కు చెందిన ప్రముఖ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన సుర్బానా జురాంగ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గృహ నిర్మాణాలు పెద్ద ఎత్తున చేపట్టాలని, ‘హౌసింగ్ ఫర్ ఆల్’ పథకంలో భాగస్వామ్యం కావాలని కోరారు. మౌలిక వసతుల ప్రాజెక్టులపై తమ దృష్టి ఉందని సీఎం వివరించగా, సుర్బానా సంస్థ ఏపీలో హౌసింగ్ రంగంలో సహకరించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది.

మలేషియాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎవర్సెండై కార్పొరేషన్ ఛైర్మన్ భెర్హాద్,మేనేజింగ్ డైరెక్టర్ తాన్‌శ్రీ ఏ.కె. నాథన్ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఆధునిక ఫ్యాబ్రికేషన్ యూనిట్, ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు గురించి చర్చ జరిగింది. ఈ ఫ్యాక్టరీని విశాఖపట్నం లేదా కృష్ణపట్నంలో దాదాపు 2 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించాలన్నది ఎవర్సెండై చైర్మన్ ప్రతిపాదన. ఈ కొత్త ఫ్యాక్టరీని వ్యూహాత్మక ప్రదేశంలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసి దేశమంతటా ఫ్యాబ్రికేషన్ ఉపకరణాలను సరఫరా చేయాలన్నది ఎవర్సెండై ఆలోచన చేస్తునట్టు తెలిపింది.

ఎవర్సెండై సంస్థ ప్రతినిధులు అమరావతి రాజధాని నిర్మాణంలో మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో కూడా భాగస్వామ్యం కావాలని తెలియజేశారు. అంతేకాకుండా రాష్ట్రంలోని ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీ సిటీ వంటి సంస్థలతో కలిసి స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ ట్రైనింగ్ సెంటర్ స్థాపనపై కూడా ముఖ్యమంత్రితో చర్చించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని 20 పోర్టులు, 15 ఎయిర్‌పోర్టులు అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఏపిని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని, ఈ ప్రాంతాలను ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌లుగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ విధంగా రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

Tags:    

Similar News