ఏడాదికి రెండుసార్లు జరుపనున్న సీబీఎస్ఈ బోర్డు 10 వ తరగతి పరీక్షలు
2026 నుంచి సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షల విధానంలో మార్పు;
సెంట్రల్ బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.2026 నుంచి సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించనున్నట్టు ప్రకటించింది.ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మరియు మే నెలలో జరగనున్నట్టు తెలియచేసింది.మొదటి విడత పరీక్షలు ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్టు, ఈ పరీక్షలకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలి అని తెలిపింది.రెండోవిడత పరీక్షలు మే నెలలో నిర్వహించనున్నట్టు ఇది ఐచ్చికం.తమ పెరఫార్మెన్సు పెంచుకోవాలి అనే విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవొచ్చు అని తెలిపింది.
సీబీఎస్ఈ ఎక్సమినేషన్ కంట్రోల్ భరద్వాజ్ మాట్లాడుతూ ఫిబ్రవరి, మే నెలలో నిర్వహించే పరీక్షల ఫలితాలు ఏప్రిల్, జూన్ నెలలో విడుదల అయుతాయి అన్నారు.పెరఫార్మెన్సు పెంచుకోవాలి అనుకునే విద్యార్థులుసైన్స్, మ్యాథమెటిక్స్ ,సోషల్ సైన్స్ ,లాంగ్వేజ్ లో ఎదైనా మూడు సబ్జెక్టులను ఎంచుకొని బెటర్మెంట్ కోసం రాసుకోవచ్చు అని వెల్లడించారు.