రాయలసీమకు జీవనాడిగా బసకచర్ల ప్రాజెక్ట్

చంద్రబాబు–అమిత్ షా భేటీలో 40 నిమిషాల చర్చలో ప్రధాన అంశంగా బసకచర్ల ప్రాజెక్ట్;

Update: 2025-07-16 09:36 GMT

రాయలసీమ ప్రాంతం ఎప్పటినుంచో కరువుతో పాటే నీటి కొరతతోనూ బాధపడుతోంది, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించేందుకు పోలవరం నుంచి బసకచర్ల వరకు ప్రతిపాదిత ప్రాజెక్ట్ అత్యంత కీలకం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు ఈ విషయాన్ని కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షాకు ఆయన వివరించారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా సముద్రంలోకి వెళ్లే వరదనీటిని రాయలసీమకు తరలించేందుకు ప్రతిపాదనలు చేశామని ఆయన తెలిపారు.

పోలవరం నుండి కర్నూలు జిల్లా బసకచర్ల రెగ్యూలేటర్ వరకు సుమారు 200 టీఎంసీల వరదనీటిని తరలించేందుకు ప్రణాళిక రూపొందించామని వివరించారు.గోదావరి నదిలో ఎగువ దిగువ ప్రాంతాలకు పూర్తిగా నీరు అందిన తరువాత కూడా దాదాపు 90 నుండి 120 క్యూసెక్కుల నీరు గోదావరి మిగులు జలాలు ఉండిపోతాయి అని చంద్రబాబు తెలిపారు. ఈ నీటిని వినియోగించుకోవాలనే లక్ష్యంతోనే బసకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించామని ఆయన వివరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి నదీ పరీవాహిక ప్రాంతాల్లో చివరిది కావడంతో నదిలో వృథాగా పోతున్న నీటిని వినియోగించుకునే హక్కు రాష్ట్రానికి ఉందని అమిత్ షా గారికి చంద్రబాబు వివరించారు. ప్రాజెక్టు వల్ల రాయలసీమ ప్రాంతానికి శాశ్వత నీటి సరఫరా కలిగి సాగునీటి కొరత నివారించవచ్చని తెలియచేసారు.

చంద్రబాబు మరియు అమిత్ షా మధ్య జరిగిన సుమారు నలభై నిమిషాల సమావేశంలో ప్రధానంగా బసకచర్ల ప్రాజెక్టుపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. క్లిష్ట ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అండగా నిలుస్తుండటం పట్ల కేంద్రానికి కృతజ్ఞతలు కేంద్రానికి తెలిపారు.

రాష్ట్ర విభజన తరువాత ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్రం మరింత సహకారం అందించాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు.వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడంతో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు కేంద్రం సహాయం కీలకం అని తెలియచేసారు.ఈ ఆర్థిక నష్టాన్ని పరిగణలోకి తీసుకుని కేంద్ర వనరులలో రాష్ట్రానికి వాటా కేటాయించాలన్న అభ్యర్థనతో 16వ ఆర్థిక సంఘానికి ఇప్పటికే నివేదిక సమర్పించామని చంద్రబాబు స్పష్టం చేశారు.

Tags:    

Similar News