జలాంతర్గాముల రక్షణలో సరికొత్త అధ్యాయం
అత్యవసర సముద్ర రక్షణకు సిద్ధం – INS నిస్తార్ నౌక జాతికి అంకితం;
జలాంతర్గాములు ప్రమాదంలో ఉన్నపుడు అత్యవసర సహాయ చర్యల కోసం రూపొందించిన అత్యాధునిక నౌక "ఐఎన్ఎస్ నిస్తార్"ను జూలై 18వ తేదీన విశాఖపట్నంలో కేంద్ర మంత్రి శ్రీ సంజయ్ సేధ్ జాతికి అంకితం చేశారు.
ఈ కార్యక్రమం తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా భారత నేవీ అడ్మిరల్ దినేష్ కే. త్రిపాఠి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు.
"ఐఎన్ఎస్ నిస్తార్" ప్రముఖ నిర్మాణ సంస్థ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్(HSL) ఆధ్వర్యంలో దీన్ని రూపొందించారు.దీని బరువు 10500 టన్నులు,120 మీటర్లు పొడవుతో నిర్మితమైన ఈ నౌక 80 శాతం స్వదేశీ పరిజ్ఞానం ఆధారంగా రూపొందించారు."ఐఎన్ఎస్ నిస్తార్" పూర్తిగా రిమోట్ కంట్రోల్ టెక్నాలజీతో పనిచేస్తుంది అని నేవీ వర్గాలు వెల్లడించాయి.
ప్రత్యేక డ్రైవింగ్ టీమ్, అత్యవసర రక్షణ చర్యల కోసం సిద్ధంగా ఉంటుంది ఈ నౌక,ప్రత్యేక డ్రైవింగ్ టీమ్, అత్యవసర రక్షణ చర్యల కోసం సిద్ధంగా ఉంటుంది.బహుళ వినియోగ డెక్కులు - హెలికాప్టర్ కలిగి ఉండటం ఈ నౌక ప్రత్యేకతలు.ఈ నౌక ద్వారా సముద్ర గర్భంలో ఆపదలో ఉన్న నావికులను రక్షించడంలో భారత నౌకాదళం సామర్థ్యం మరింత పెరిగింది. ఇదే సమయంలో, దేశీయంగా అభివృద్ధి చేసిన పరిజ్ఞానంతో నిర్మించబడిన ఈ నౌక భారత్ నౌక దశ దిశ మార్చే మరో పెద్ద అడుగు.
ఐఎన్ఎస్ నిస్తార్ నౌక నౌకాదళానికి ఒక ప్రధాన ఆస్తిగా మారనున్నది. జలాంతర్గాముల రక్షణ రంగంలో ఇది కొత్త దారులను చూపిస్తూ, అత్యవసర స్పందనలో వేగం, నాణ్యత, నౌకాదళం వ్యూహాత్మకతకు బలంగా నిలుస్తుంది.