వివేకా హత్యలో కీలక మలుపు
న్యాయం కోసం సునీత, చంద్రబాబుతో భేటీ - "మా కుటుంబం కోసమే కాదు, రాష్ట్ర ప్రజలకు న్యాయం తెలియాలి ";
వైఎస్ సునీత, వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె, తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సమావేశంలో సునీత గారు, తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య కేసును విచారణ లో జరుగుతున్న జాప్యం గురించి, తనకు సరైన న్యాయం జరగటం లేదని, మరియు ఈ కేసు త్వరగా పూర్తి చేయడానికి ప్రభుత్వ మద్దతు ఇవ్వమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేశారు.
వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడుగా ఉన్నారు. 2019లో ఆయన హత్య చేయబడిన విష్యం తెలిసిందే, ఇది రాష్ట్రంలో పెద్ద చర్చకు కారణమైంది. వివేకానంద రెడ్డి హత్య కేసు, ప్రజలలో తీవ్ర ఆవేదనను కలిగించింది. ఆయన మరణంతో సంబంధం ఉన్న కేసులో ఇప్పటివరకు నిజమైన నిందితులు తేలకపోవడంతో, ఆయన కుటుంబం మరియు వివేకానంద రెడ్డి అభిమానులు ఈ కేసులో న్యాయం జరుగుతుందా అనే ఆలోచనలో ఉన్నారు.
సునీత గారు, తన తండ్రి హత్య కేసులో న్యాయం పొందడానికి ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు. ఈ సందర్భంగా, ఆమె గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ, కేసును తొందరగా న్యాయం జరిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ నుంచి అన్ని విధాలా మద్దతు తీసుకుని, న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు పూర్తి నమ్మకం కలిపించాలి అని సునీత గారు తెలిపారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్ సునీత గారి ఆవేదనను అర్థం చేసుకుని, ఆయన హత్య కేసును సీరియస్‌గా తీసుకొని, ప్రభుత్వం పరంగా అందరి సహకారంతో కేసును త్వరగా విచారించడమే కాకుండా న్యాయం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు చేశారు. ముఖ్యమంత్రి, సునీత గారికి తన పూర్తి మద్దతు ప్రకటించారు.
ఈ కలయిక వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఆందోళనలు మొదలయ్యాయి,సొంత బాబాయ్ హత్యకేసులో ఆనాటి వైస్సార్సీపీ పార్టీ అధికారం లో ఉన్న పెద్దగా పట్టించుకోలేదు.తన తండ్రి హత్య కేసు విషయమై గత ప్రభుత్వ హయాంలో చాలా ప్రయత్నాలు చేసి వివలం అయ్యారు సునీత.ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అయినా తనకు న్యాయం చూస్తుంది అని ఆమె ఆశ పడుతున్నట్టు తెలుస్తుంది.