రాజీవ్ గాంధీ హత్యకేస్ పై వెబ్ సిరీస్
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దర్యాప్తును ఆవిష్కరిస్తుంది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, కుకునూర్ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సిరీస్ జులై 4న సోనీ లివ్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ కానుంది.;
సోనీ లివ్ ఈ ఏడాది ‘ది వేకింగ్ ఆఫ్ నేషన్, బ్లాక్, వూట్ అండ్ గ్రే, లవ్ కిల్స్, కంఖజుర’ వంటి సూపర్ హిట్ షోలతో దూసుకెళ్తోంది. ఇప్పుడు మరో ఆసక్తికర సిరీస్‌తో కమ్ బ్యాక్ అవుతోంది. అదే ‘ది హంట్ : ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్’. ప్రముఖ దర్శకుడు నాగేష్ కుకునూర్ రూపొందించిన ఈ సిరీస్, భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దర్యాప్తును ఆవిష్కరిస్తుంది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, కుకునూర్ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సిరీస్ జులై 4న సోనీ లివ్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ కానుంది. లేటెస్ట్ గా దీని ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘ది హంట్’ సిరీస్ రాజీవ్ గాంధీ హత్య తర్వాత జరిగిన సంఘటనలను చూపిస్తుంది. డి.ఆర్. కార్తికేయన్ నేతృత్వంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఈ హత్య వెనుక ఉన్నవారిని కనిపెట్టే బాధ్యతను అందుకుంది. కేవలం 90 రోజుల్లోనే ఈ దాడి వెనుక ఉన్నవారిని సిట్ ఎలా కనుగొన్నదీ అన్నది ఈ షో వివరిస్తుంది. గూఢచారులు, వారి కథలు, న్యాయం కోసం చెల్లించాల్సిన భారీ మూల్యాన్ని కూడా ఇది ఆవిష్కరిస్తుంది.
అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, సోనీ లివ్ గతంలో ‘స్కామ్ 1992, తనావ్, స్కామ్ 2003’ వంటి బ్లాక్‌బస్టర్ షోలను అందించాయి. ఇప్పుడు మరో హిట్‌తో రాబోతున్నట్లు కనిపిస్తోంది. నాగేష్ కుకునూర్ తన ప్రతిష్ఠాత్మక చిత్రాలకు పేరుగన్న దర్శకుడు. ఈ సిరీస్ కూడా అతడికి మరో విజయాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. మొత్తంగా, ‘ది హంట్ : ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్’ ఒక ఆసక్తికర అనుభవాన్ని అందించేలా ఉంది.
ఈ సిరీస్‌లో అమిత్ సియాల్, సాహిల్ వైద్, భగవతి పెరుమాళ్, డానిష్ ఇక్బాల్, గిరీష్ శర్మ, విద్యుత్ గార్గ్, షఫీక్ ముస్తఫా, అంజనా బాలాజీ, బి సాయి దినేష్, శృతి జయన్, గౌరీ మీనన్ వంటి ప్రతిభావంతులు నటించారు. దీనిని రోహిత్ బనావలీకర్, శ్రీరాం రాజన్ కలిసి రాశారు. ఎన్నో అంచనాలు, ఆసక్తి మధ్య ‘ది హంట్ : ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్’ సిరీస్ జులై 4 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది.