సుమంత్ ‘అనగనగా’.. ఓటీటీలో వినిపించబోయే కథ!
సుమంత్ ‘అనగనగా’.. ఓటీటీలో వినిపించబోయే కథ!టాలీవుడ్‌లో జయాపజయాలతో సంబంధం లేకుండా విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు సుమంత్. తాజాగా సుమంత్ ‘అనగనగా’ అనే విభిన్నమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సన్నీ సంజయ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ థియేటర్‌కు కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.
లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ‘అనగనగా’ టీజర్ కు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. కథ వినిపించే ఓ టీచర్ జీవితం, అతని పోరాటం చుట్టూ అల్లుకున్న ఈ కథలో సుమంత్ ప్రధాన పాత్ర పోషించాడు. పిల్లలకు పాఠాలను బోధించడం కంటే కథలు చెప్పడం ముఖ్యం అనుకునే ఓ టీచర్‌గా అతని పాత్ర కనిపించబోతుంది. అయితే, సమాజం అతని ఆలోచనను సమర్థించదనే కథనంతో ఆసక్తికరంగా ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. కాజల్ చౌదరి, అవసరాల శ్రీనివాస్, అను హాసన్, మాస్టర్ విహార్ష్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఉగాది కానుకగా మార్చి 30న ఈ చిత్రం విడుదల కానుంది.