‘పాతాళ్ లోక్’ వెబ్ సిరీస్ సీజన్ 2 ఎలా ఉందంటే.... !

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సిరీస్ సామాజిక అంశాలను స్పృశిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు, దాదాపు నాలుగేళ్ల తర్వాత..;

By :  K R K
Update: 2025-01-19 13:00 GMT

'పాతాళ్ లోక్' రెండో సీజన్ జనవరి 17 నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చింది.2020లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'పాతాళ్ లోక్' ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సిరీస్ సామాజిక అంశాలను స్పృశిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు, దాదాపు నాలుగేళ్ల తర్వాత.. 'పాతాళ్ లోక్' రెండో సీజన్ జనవరి 17 నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చింది. మొదటి సీజన్‌తో పోల్చితే మరింత ఆసక్తికరంగా సీజన్ 2 ను రూపొందించినట్లు సోషల్ మీడియా టాక్ చెబుతోంది.

సీజన్ 2లో ఢిల్లీ పోలీసు అధికారి హాథీరామ్ చౌదరి ఒక హైప్రొఫైల్ కేసును ఛేదించేందుకు నాగాలాండ్‌కు ప్రయాణిస్తాడు. అక్కడ అతను నాగాలాండ్ డెమోక్రటిక్ ఫోరమ్ వ్యవస్థాపకుడు థామ్ హత్యను విచారించే బాధ్యతను చేపడతాడు. అయితే, అదే సమయంలో రఘు పాశ్వాన్ అనే కూలీ అదృశ్యమవడం ఆ కేసు మరో మలుపు తిరుగుతుంది . పరస్పర సంబంధం లేని ఈ రెండు కేసులను పరిశీలించే క్రమంలో హాథీరామ్ చౌదరికి అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఆ కేసుల వెనుక దాగిన చీకటి నిజాలను అతను ఎలా వెలికితీశాడు? చివరకు మిస్టరీని ఛేదించాడా? అనే అంశాలు ప్రేక్షకుల్లో ఉత్కంఠతను పెంచుతాయి.

'పాతాళ్ లోక్' రెండో సీజన్ జనవరి 17 నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చింది.సీజన్ 1కు క్రియేటర్‌గా వ్యవహరించిన సుదీప్ శర్మ ఆధ్వర్యంలో రూపొందిన ఈ సిరీస్‌కు అవినాష్ అరుణ్, ప్రసిత్ రాయ్‌లు దర్శకత్వం వహించారు. తాజా సీజన్‌ను అనుష్క శర్మ నిర్మించగా, అవినాష్ అరుణ్ ధావేర్ దర్శకత్వం వహించారు. మొత్తం 8 ఎపిసోడ్‌లతో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సిరీస్‌కు మంచి స్పందన లభిస్తోంది. హాథీరామ్ చౌదరిగా జయదీప్ అహ్లావత్ తన అద్భుతమైన నటనతో మరోసారి మెప్పించగా, అన్సారీగా ఇష్వాక్ సింగ్ కీలక పాత్ర పోషించాడు.

ఈ సీజన్‌లో బలమైన పాత్రలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, అత్యుత్తమ బ్యాగ్రౌండ్ స్కోర్ ముఖ్య ఆకర్షణలుగా నిలిచాయి. నరేన్ చంద్రవర్కర్, బెనెడిక్ట్ టేలర్ అందించిన సంగీతం, అవినాష్ అరుణ్ సినిమాటోగ్రఫీ సిరీస్‌కు ప్రత్యేక శోభను తెచ్చాయి. హాథీరామ్ పాత్రలో జయదీప్ అహ్లావత్ ఓవైపు కుటుంబం, మరోవైపు డ్యూటీ మధ్య నలిగిపోతున్న పోలీసు అధికారిగా తన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు.

Tags:    

Similar News