ఓటీటీలోకి 'కొత్త లోక'

మలయాళ సినీ పరిశ్రమలో సరికొత్త సంచలనం సృష్టించింది ‘లోక: చాప్టర్ 1 – చంద్ర’. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల గ్రాస్‌ వసూళ్లను అందుకొని రికార్డు నెలకొల్పింది.;

By :  S D R
Update: 2025-10-15 00:26 GMT

మలయాళ సినీ పరిశ్రమలో సరికొత్త సంచలనం సృష్టించింది ‘లోక: చాప్టర్ 1 – చంద్ర’. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల గ్రాస్‌ వసూళ్లను అందుకొని రికార్డు నెలకొల్పింది. కళ్యాణి ప్రియదర్శన్ సూపర్‌పవర్స్‌ కలిగిన యువతిగా మెరిసిన ఈ చిత్రం, తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో విడుదలై ఇక్కడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.

దుల్కర్ సల్మాన్ సొంత బ్యానర్ వే ఫారర్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. నస్లెన్, సాండీ మాస్టర్, అరుణ్ కురియన్ వంటి నటులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించగా, జేక్స్ బిజోయ్ అందించిన సంగీతానికి మంచి పేరొచ్చింది.

థియేటర్లలో ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీకి అడుగుపెడుతోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం, ‘లోక’ అక్టోబర్ 17న జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కి రానుందని టాక్ వినిపిస్తోంది. 'కమింగ్ సూన్' అంటూ ప్లాట్‌ఫామ్ ఇప్పటికే ఆసక్తికరమైన టీజర్‌ను విడుదల చేసింది.

కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘లోక’ ఇంత భారీ స్థాయిలో విజయం సాధించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. థియేటర్లలో 50 రోజులు దాటిన వేళ, అభిమానులు ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ పైనా 'లోక' కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.



Tags:    

Similar News