విజయ్ దేవరకొండ సినిమా వచ్చేది అప్పుడేనా?

Update: 2025-01-16 03:20 GMT

టాలీవుడ్ రౌడీ హీరో.. విజయ్ దేవరకొండ ప్రస్తుతం రేసులో కాస్తంత వెనుక బడ్డాడు. గత కొంతకాలంగా అతడి సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అవలేక పోతున్నాయి. అయినప్పటికీ.. మళ్లీ క్రేజ్ తెచ్చుకోవాలంటే కంటెంట్ అండ్ మేకింగ్ పరంగా రిచ్‌గా ఉండే సినిమాతో రావాలని అతడు కృషి చేస్తున్నాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ క్రైమ్ డ్రామా లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల ఆలస్యమైంది. అయినా, ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఇప్పటికే ఈ సినిమా ఓటిటి హక్కులను సొంతం చేసుకుంది. ఇదివరకు ఈ సినిమాను ఒకే భాగంగా విడుదల చేస్తామని తెలిపిన నిర్మాణ సంస్థ, ఇప్పుడు రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో ఉంది.

తాజా సమాచారం ప్రకారం.. రెండు పార్టుల్లో రెండు వేరు వేరు కథలు ఉంటాయని తెలుస్తోంది. అయితే, మొదటి భాగం విడుదల తేదీపై ఇంకా స్పష్టత లేదు. మార్చి 28న సినిమాను విడుదల చేస్తామని ముందుగా ప్రకటించినప్పటికీ.. తాజా సమాచారాన్ని బట్టి సమ్మర్ తర్వాతే విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.

Tags:    

Similar News