వరుస సినిమాలతో వెంకీ దూకుడు !
ఈ ఏడాది "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో సక్సెస్ బోణీ కొట్టిన ఈ సీనియర్ స్టార్.. ఓటీటీలో "రానా నాయుడు"తోనూ సందడి చేశాడు. ఇప్పుడు వరుసగా ప్రాజెక్టులతో 2026 వరకూ బిజీగా ఉండబోతున్నాడు.;
వయసు పెరుగుతుంటే.. కొందరు నటులు వెనక్కి తగ్గుతారు. కానీ విక్టరీ వెంకటేష్ మాత్రం వయసుతో సంబంధం లేకుండా స్పీడ్ గా దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో సక్సెస్ బోణీ కొట్టిన ఈ సీనియర్ స్టార్.. ఓటీటీలో "రానా నాయుడు"తోనూ సందడి చేశాడు. ఇప్పుడు వరుసగా ప్రాజెక్టులతో 2026 వరకూ బిజీగా ఉండబోతున్నాడు.
మొదటగా.. వెంకీ77 సినిమా గురించి హైప్ బాగా ఉంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కబోయే ఈ ప్రాజెక్ట్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు మాస్ అప్పీల్‌ను మిక్స్ చేసే సినిమా కానుంది. అంతేకాదు, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "మన శంకర వర ప్రసాద్ గారు" సినిమాలో వెంకటేష్ ఓ సర్‌ప్రైజ్ క్యామియో రోల్‌లో కనిపించ బోతున్నాడు. దీంతో ఈ సినిమాకి మరింత స్టార్ పవర్ యాడ్ అవనుంది.
షెడ్యూల్ ఇక్కడితో ఆగడం లేదు. వెంకటేష్ "దృశ్యం 3" మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో మూడో భాగం కోసం అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మొదటి రెండు సినిమాల సక్సెస్ చూస్తే, వెంకటేష్ పాత్రలోని నైతిక సందిగ్ధతలు ఈసారి స్క్రీన్‌పై ఎలా ఆవిష్కృత మవుతాయో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంత లాంగ్ కెరీర్‌లో ఇంత బిజీగా ఉండటం అరుదు. కానీ వెంకటేష్ మాత్రం ఆగడం లేదు.