'ది ప్యారడైజ్'.. నానికి తల్లిగా సోనాలి!
నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న 'ది ప్యారడైజ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో నాని లుక్, క్యారెక్టరైజేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
'ది ప్యారడైజ్' సినిమా మదర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగనున్నట్టు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ను బట్టి తెలుస్తోంది. గ్లింప్స్ ఆద్యంతం తన కొడుకు గురించి ఓ తల్లి చెప్పిన డైలాగ్స్ తో అలరించింది. శ్రీకాంత్ ఓదెల తన గత చిత్రం 'దసరా'లో మాస్ ఎలిమెంట్స్‌ను బలంగా ప్రెజెంట్ చేశాడు. అయితే ఈ కథను ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ మిక్స్ చేసి సరికొత్తగా డిజైన్ చేసినట్టు సమాచారం.
నాని తర్వాత ఈ సినిమాలో ఎంతో ప్రధానమైన మదర్ రోల్ కోసం మరాఠీ నటీమణి సోనాలి కులకర్ణిని తీసుకున్నారట. ఆమెకు ఇది తొలి తెలుగు సినిమా కానుంది. ఆడియన్స్ కు హై వోల్టేజ్ యాక్షన్ ట్రీట్ అందించేందుకు రెడీ అవుతున్న 'ది ప్యారడైజ్' 2026 మార్చి 26న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది.