సుకుమార్ - కార్తి కాంబో అదిరింది కదా !
నాకు కార్తి అంటే చాలా ఇష్టం. అతని ముఖం ఎంతో కథ చెబుతుంది. కాబట్టి నేను కార్తినే ప్రిఫర్ చేస్తాను" అని సుకుమార్ పేర్కొన్నారు.;
"పుష్ప 2" ఘన విజయంతో ఇండియాలోని టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో సుకుమార్ తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్, కోలీవుడ్ వంటి వివిధ చిత్ర పరిశ్రమల ఈవెంట్లకు హాజరవుతూ, తన ఉనికిని మరింత పెంచుకుంటున్నారు. చెన్నైలో ఇటీవల జరిగిన ఒక అవార్డు వేడుకలో సుకుమార్‌కు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. "తమిళ చిత్రసీమలో ఒక భారీ స్థాయిలో సినిమా తీసే అవకాశం వస్తే, ఏ నటుడిని ఎంపిక చేస్తారు?" అని విలేకరులు అడిగారు.
దీనికి ఆయన తెలుగులో స్పందించగా, ఎస్.జె. సూర్య తమిళంలో అనువ దించారు. "నిజంగా చెప్పాలంటే, నేను విజయ్ సినిమాలు చాలా తక్కువ చూశాను. అదేవిధంగా అజిత్ సినిమాలు కూడా ఎక్కువగా చూడలేదు. కానీ నాకు కార్తి అంటే చాలా ఇష్టం. అతని ముఖం ఎంతో కథ చెబుతుంది. కాబట్టి నేను కార్తినే ప్రిఫర్ చేస్తాను" అని సుకుమార్ పేర్కొన్నారు. అయితే, ఎస్.జె. సూర్య ఈ వ్యాఖ్యను తక్కువ స్వల్ప మార్పులతో అనువదించారు. ఆయన చేసిన అనువాదంలో, సుకుమార్ విజయ్, అజిత్, కార్తిలను భారీ స్థాయిలో తమిళ చిత్రానికి ఎంపిక చేసుకున్నట్లు అనిపించింది.
తెలుగు ప్రేక్షకులకు కార్తి పెద్దగా కొత్తేమీ కాదు. "ఊపిరి" సినిమా ద్వారా ఆయనకు తెలుగులో విశేషమైన అభిమాన వర్గం ఏర్పడింది. అంతేకాక, కార్తి సినిమాలు ఎక్కువగా తెలుగులో డబ్ అవుతుండటంతో, విజయ్, అజిత్‌ల కన్నా ఆయన తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. రజనీకాంత్, కమల్ హాసన్ స్థాయిలో విజయ్, అజిత్ సినిమాలు తెలుగులో ఎక్కువగా విడుదల కాలేదు. అందుకే, సుకుమార్ కార్తిపై ప్రత్యేక ఆసక్తి చూపించడాన్ని చాలామంది సహజంగా భావిస్తున్నారు.