టీనేజ్ లోకి అడుగుపెట్టిన సితూ పాప !
“ఇంతలోనే... ఆమె టీనేజర్ అయిపోయింది.. హ్యాపీ బర్త్‌డే సితూ పాపా... నీవు ఎప్పుడూ నా జీవితాన్ని వెలిగిస్తావు... నీకు నా ప్రేమ....” అంటూ.. మహేశ్ బాబు కూతురి పట్ల తన ప్రేమను వ్యక్తపరిచాడు.;
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని ఇప్పటికే తనకంటూ ఓ సెలబ్రిటీ ఇమేజ్ సంపాదించుకుంది. తన సూపర్‌స్టార్ తండ్రి లాగే.. సితార చిన్నతనం నుంచి లైమ్‌లైట్‌లో ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌తో, ఆమె రీల్స్, పోస్ట్‌లు, చక్కటి పర్సనాలిటీతో అందరి మనసులు గెలుచుకుంది. సితారా ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్‌కు మోడల్‌గా కూడా వ్యవహరించి.. తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంటోంది.
ఇప్పుడు ఈ చిన్ని స్టార్ తన 13వ పుట్టినరోజును స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా మహేష్ బాబు, సితారతో కలిసి ఓ అందమైన ఫోటో షేర్ చేసి.. హృదయపూర్వక నోట్ రాశాడు. “ఇంతలోనే... ఆమె టీనేజర్ అయిపోయింది.. హ్యాపీ బర్త్‌డే సితారా... నువ్వు ఎప్పుడూ నా జీవితాన్ని వెలిగిస్తావు... నీకు నా ప్రేమ....” అంటూ.. మహేశ్ బాబు కూతురి పట్ల తన ప్రేమను వ్యక్తపరిచాడు.
మహేష్ బాబు 2005లో నటి నమ్రతా శిరోద్కర్‌ను కొన్ని సంవత్సరాల డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు గౌతమ్ కృష్ణ ఘట్టమనేని.. న్యూయార్క్‌లో చదువుతుండగా.. కూతురు సితార.. హైదరాబాద్‌లో చదువుకుంటోంది. సితారా తన తల్లిదండ్రుల బాటలో నటిగా రాణించాలని ఆశయంగా ఉన్నట్లు సమాచారం.