మళ్లీ బాక్సాఫీస్ దున్నేస్తున్న రెబల్ స్టార్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను.. మళ్లీ రెబెల్ స్టార్ గా మార్చిన చిత్రం ‘సలార్‘. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2023 డిసెంబర్ లో విడుదలై ఘనవిజయం సాధించి, రూ. 700 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పటికే థియేటర్లలో దుమ్ములేపిన ఈ చిత్రం, ఓటీటీలోనూ తన ప్రభావాన్ని చూపించింది.
లేటెస్ట్ గా మరోసారి ‘సలార్‘ థియేటర్లలోకి వచ్చింది. రీ-రిలీజ్ లోనూ ఈ సినిమా భారీ రెస్పాన్స్ సాధిస్తోంది. ఈ చిత్రం మొదటి రోజే రూ. 3.24 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టడం విశేషం. పరిమిత థియేటర్లలో విడుదలైనా, ఈ మూవీకి అంతటా అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతుంది.
ఈ చిత్రంలో ప్రభాస్‌ను హై-ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ఫుల్ యాక్షన్ మోడ్‌లో చూపించి, ప్రేక్షకులను కట్టిపడేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ముఖ్యంగా ఈ మూవీలో ప్రభాస్ ఎలివేషన్ సీన్స్ పీక్స్ లో ఉంటాయి. ఆ గూస్ బంప్స్ సన్నివేశాలను మళ్లీ ఇప్పుడు థియేటర్లలో ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు ‘సలార్‘ సెకండ్ పార్ట్ ‘శౌర్యంగ పర్వం‘ ఈ ఏడాది చివరిలో పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.