‘స్పిరిట్’ షూటింగ్ మొదలయ్యేది అప్పుడే !

సందీప్ సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ.. అమెరికాలో జరిగిన సెలబ్రిటీ క్రికెట్ మేళాలో కాజువల్‌గా ఈ విషయం పంచుకున్నారు.;

By :  K R K
Update: 2025-07-04 01:00 GMT

"షూట్ త్వరలో స్టార్ట్" అని గతంలో రెండు మూడు సార్లు చెప్పారు. కానీ ఇప్పుడు నేరుగా టీమ్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చేసింది. ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ ఈ సెప్టెంబర్‌లో కెమెరాలు ఆన్ చేయబోతోంది. ఈ అప్‌డేట్ ఏ ప్రెస్ రిలీజ్‌తోనో, సోషల్ మీడియా పోస్ట్‌తోనో రాలేదు. సందీప్ సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ.. అమెరికాలో జరిగిన సెలబ్రిటీ క్రికెట్ మేళాలో కాజువల్‌గా ఈ విషయం పంచుకున్నారు.

మొదట డిసెంబర్ 2024 లో షూటింగ్ మొదలవుతుందని అనుకున్నారు. కానీ షెడ్యూల్ ట్రాఫిక్, బ్యాక్‌గ్రౌండ్ ట్వీక్స్, హీరోయిన్ మార్పు వంటివి ప్రాజెక్ట్‌ను కాస్త ఆలస్యం చేశాయి. ముందుగా.. దీపికా పదుకొణెను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ క్రియేటివ్ క్లాషెస్, డేట్స్ సమస్యలతో ఆమె తప్పుకుంది. ఆ స్థానంలోకి వచ్చింది యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ. ప్రభాస్ బిగ్ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ కాస్త స్లో అయింది. ఇప్పుడు సెప్టెంబర్ లో షూట్ అనగానే.. ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ ఊపందుకుంది.

ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ చిత్రం షూటింగ్ తో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు. డిసెంబర్ లో సినిమా రిలీజ్ కాబోతోంది. చిత్రీకరణ చివరిదశలో ఉన్న ఈ సినిమా తర్వాత ప్రభాస్ వెంటనే చేయబోయే సినిమా ‘స్పిరిట్’. ఈ సినిమా షూట్ మొదలయ్యే టైమ్ కి ‘ది రాజాసాబ్’ షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. సైమల్ టేనియస్ గా ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ కూడా కంటిన్యూ అవుతుంది.

Tags:    

Similar News