ప్రభాస్ కి సందీప్ రెడ్డి కండిషన్స్!

Update: 2025-03-12 03:20 GMT

సినిమా పరిశ్రమలో స్టార్ హీరోల డేట్ల కోసం దర్శకనిర్మాతలు ఎదురుచూడటం సహజం. అయితే, ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే, ఇది మరింత క్లిష్టంగా మారుతుంది. ‘బాహుబలి’ తర్వాత ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో, షూటింగ్ షెడ్యూల్ పూర్తిగా ప్రభాస్ టైమ్‌ఫ్రేమ్‌కు అనుగుణంగా మారిపోయింది. కానీ, సందీప్ రెడ్డి వంగా మాత్రం ప్రభాస్ నే తన మార్గంలోకి లాక్కుంటున్నాడట.

‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ కి ముందుగానే కండిషన్స్ పెట్టాడట సందీప్. సినిమా ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకు ప్రభాస్ మరో ప్రాజెక్ట్ చేయకూడదని, సినిమా లుక్‌తో బహిరంగ ప్రదర్శనలు తగ్గించాలని ప్రభాస్ కి స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది.

ఇటీవల ప్రభాస్ షూటింగులకు విరామాలు తీసుకోవడం, విదేశీ ట్రిప్పుల కారణంగా సినిమాలు ఆలస్యం అవుతుండగా, ‘స్పిరిట్’ విషయంలో అలా జరుగనివ్వకూడదనే ధృఢసంకల్పంతో సందీప్ ఉన్నాడట. స్టార్ హీరోల కాల్షీట్లు లభించిన తర్వాత దర్శకులు వారిపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించలేకపోవడం సాధారణమే. కానీ, సందీప్ మాత్రం ప్రభాస్‌ను పూర్తిగా తన కంట్రోల్‌లోకి తీసుకోబోతున్నాడట.

Tags:    

Similar News