సేతుపతి - పూరీ కాంబో కోసం సోషల్ మీడియా స్టార్
ఈ ప్రాజెక్ట్‌కు మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయకుడిగా విజయ్ సేతుపతి ఎంపికయ్యారు. ఆయన సరసన నిహారిక నటించనుంది.;
సోషల్ మీడియా రీల్స్‌తో మంచి క్రేజ్ తెచ్చుకుంది నిహారిక యన్ ఎమ్. ఆమెకు ఇప్పుడు 3.5 మిలియన్లకుపైగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల విడుదలైన హిట్ సినిమా "పెరుసు" లో వైభవ్ కు జోడీగా నటించి మరింత గుర్తింపు పొందింది. ఇప్పుడు ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది. పాన్‌ఇండియా స్థాయిలో రూపొందుతున్న భారీ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది.
ఈ ప్రాజెక్ట్‌కు మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయకుడిగా విజయ్ సేతుపతి ఎంపికయ్యారు. ఆయన సరసన నిహారిక నటించనుంది. మొదటగా ఈ పాత్రకు పలువురు నటిమణుల పేర్లు పరిశీలించి నప్పటికీ, నిహారిక ఆడిషన్‌లో చూపిన యాక్టింగ్ టాలెంట్ టీమ్‌ను ఆకట్టుకుంది. ఈ పాత్ర ఆమె నటనా ప్రతిభను పూర్తిగా ప్రదర్శించేందుకు అవకాశమిస్తుందని, ఇది ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇందులో ప్రముఖ నటీమణి టబు, కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. "మేజర్" చిత్ర ప్రమోషన్లలో మహేశ్ బాబు సరసన నిహారిక కనిపించడం ద్వారా ఆమె క్రేజ్ మరింత పెరిగింది. అదే క్రేజ్ ఆమెకు ఇప్పుడు పెద్ద సినిమా అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో రాధికా ఆప్టే కూడా నటిస్తుందన్న వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆ వార్తలను బృందం ఖండించింది. ఇది పూర్తిగా అబద్దమని స్పష్టం చేసింది. ఈ చిత్ర షూటింగ్ వచ్చే నెల ప్రారంభం కానుంది. మరి ఈ సినిమాలో నిహారిక పాత్ర ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.