‘కమిటీ కుర్రోళ్ళు’ కాంబోలో రెండో మూవీ!
తాజా సమాచారం ప్రకారం, ఈ విజయవంతమైన ద్వయం మరో కొత్త సినిమా కోసం మళ్లీ కలుస్తున్నారు. ఈ చిత్రం 2026లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.;
మెగా డాటర్ నిహారిక కొణిదెల, యువ దర్శకుడు యదు వంశీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'కమిటీ కుర్రాళ్లు' చిత్రం తర్వాత మరోసారి కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. తొలి చిత్రంతోనే తన గ్రామీణ కథాకథనంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు యదు వంశీ.
తాజా సమాచారం ప్రకారం, ఈ విజయవంతమైన ద్వయం మరో కొత్త సినిమా కోసం మళ్లీ కలుస్తున్నారు. ఈ చిత్రం 2026లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
'కమిటీ కుర్రాళ్ళు' కేవలం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ నే కాదు, తెలంగాణ ప్రభుత్వం అందించే గద్దర్ అవార్డులు సహా అనేక పురస్కారాలను కూడా గెలుచుకుంది.
యువ దర్శకుడు యదు వంశీ ఈసారి కూడా కంటెంట్-రిచ్ ఉన్న చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కాంబోలోని రెండో సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తుండగా, సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.