‘బ్యాడ్ బాయ్’ గా అదరగొట్టనున్న నాగశౌర్య
మాస్ లుక్‌లో, రగ్గడ్ అవతార్‌లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అతని కొత్త సినిమా "బ్యాడ్ బాయ్ కార్తీక్" టీజర్‌ను లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.;
యంగ్ హీరో నాగ శౌర్య దాదాపు రెండేళ్లుగా సినిమా ప్రపంచానికి దూరంగా ఉన్నాడు. వరసగా ఫ్లాపులు రావడంతో, సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకున్నాడు. అయితే, ఇప్పుడు మాస్ లుక్‌లో, రగ్గడ్ అవతార్‌లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అతని కొత్త సినిమా "బ్యాడ్ బాయ్ కార్తీక్" టీజర్‌ను లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.
ఈ టీజర్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లు, పక్కా మాస్ మూమెంట్స్‌ని చూపించారు. చివరికి, కమెడియన్ వెన్నెల కిషోర్ చెప్పే ఓ అదిరిపోయే పంచ్ డైలాగ్‌తో టీజర్ ఎండ్ అవుతుంది. "బ్యాడ్ బాయ్ కార్తీక్"లో హీరోయిన్‌గా విధి యాదవ్ నటిస్తోంది. మ్యూజిక్ మాత్రం వెటరన్ హారిస్ జయరాజ్ అందిస్తున్నాడు.
డెబ్యూ డైరెక్టర్ రమేష్ ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు దర్శకత్వం వహిస్తుండగా, శ్రీనివాస రావు చింతలపూడి మరియు విజయ కుమార్ చింతలపూడి దీనిని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ 'బ్యాడ్ బాయ్' ఇమేజ్ నాగ శౌర్యకు సాలిడ్ కమ్‌బ్యాక్ ఇస్తుందో లేదో చూడాలి.