ఒకేసారి రెండు ప్రాజెక్ట్స్ షూటింగ్ !

సెప్టెంబర్ నుంచి.. నాగార్జున 'కింగ్ 100' చిత్రీకరణ, 'బిగ్ బాస్ తెలుగు 9' హోస్టింగ్ రెండింటినీ సమతుల్యం చేయనున్నారు.;

By :  K R K
Update: 2025-08-24 00:24 GMT

నాగార్జున అక్కినేని.. వచ్చే వారం 66వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ప్రస్తుతం ఆయన తన కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నారు. 'కుబేర', 'కూలీ' చిత్రాల్లో ఆయన నటనకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ మైలురాయి పుట్టినరోజు సందర్భంగా.. ఆయన తన 100వ చిత్రాన్ని.. తాత్కాలికంగా 'కింగ్100' అని పిలుచుకొనే సినిమాను ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు ఆర్. కార్తీక్ రూపొందిస్తున్నారు.

సెప్టెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 'కూలీ'లో విలన్ పాత్ర పోషించిన నాగార్జున, ఈ చిత్రంలో మళ్లీ పూర్తిస్థాయి మెయిన్ లీడ్ లో కనిపించనున్నారు. ఇదే సమయంలో.. నాగార్జున ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' హోస్ట్‌గా తిరిగి వస్తున్నారు. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే ఈ షో తొమ్మిదో సీజన్ కోసం.. ఆయన వారానికి కనీసం రెండు రోజులు షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.

సెప్టెంబర్ నుంచి.. నాగార్జున 'కింగ్ 100' చిత్రీకరణ, 'బిగ్ బాస్ తెలుగు 9' హోస్టింగ్ రెండింటినీ సమతుల్యం చేయనున్నారు. అయినప్పటికీ.. ఈ రెండు బాధ్యతలను ఒత్తిడి లేకుండా సులభంగా నిర్వహించగలనని ఆయన విశ్వాసంగా ఉన్నారు.

Tags:    

Similar News