‘స్పిరిట్’ కోసం మెక్సికో లొకేషన్స్ !

ప్రస్తుతం మెక్సికోలో ఈ సినిమా కోసం లొకేషన్లను పరిశీలిస్తున్నట్టు సందీప్ వెల్లడించారు. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.;

By :  K R K
Update: 2025-03-30 09:40 GMT

సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ఇండియన్ స్ర్కీన్ కే క్రేజీ డైరెక్టర్ గా మారారు. ఆయన తెరకెక్కించ బోయే ప్రభాస్ చిత్రానికి ‘స్పిరిట్’ అనే పేరు అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి.. ఈ చిత్రంపై అభిమానుల్లో అద్భుతమైన ఆసక్తి నెలకొంది. ఇటీవల ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్‌తో చేసే ఈ సినిమాకు సంబంధించి జరుగుతున్న ప్రీ-ప్రొడక్షన్ పనులు గురించి ప్రశ్నించగా... ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.

ప్రస్తుతం మెక్సికోలో ఈ సినిమా కోసం లొకేషన్లను పరిశీలిస్తున్నట్టు సందీప్ వెల్లడించారు. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. తెలుగులో ఇప్పటి వరకు చాలా తక్కువ చిత్రాలు మెక్సికోలో చిత్రీకరించబడ్డాయి. ఈ కారణంగా ‘స్పిరిట్’లో మెక్సికోను ఒక భాగంగా చేసుకోవడం సినిమాకు కొత్త విజువల్ ఫీల్ తీసుకురాబోతుందని సినీ ప్రేమికులు భావిస్తున్నారు.

సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో ప్రభాస్ సినిమాను రూపొందించేందుకు విభిన్నమైన లొకేషన్లను ఎంచుకుంటున్నాడు. మెక్సికోలో సహజ సుందర దృశ్యాలను సద్వినియోగం చేసుకుంటూ.. ఆ ప్రాంత వైభవాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నారు. ఇది భారతీయ చిత్ర పరిశ్రమలో ఓ ప్రత్యేకమైన చిత్రం అవుతుందనే భావన కూడా బలపడుతోంది. మెక్సికోలో చిత్రీకరణ జరిపే ఈ సినిమా ఎలాంటి విజువల్ ట్రీట్ ఇవ్వబోతోందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News