టాలీవుడ్ లోకి మరో మల్లూ బ్యూటీ ఎంట్రీ
ఈమె మలయాళంలో నటించిన 'ఆర్‌డీఎక్స్', 'జై గణేష్' , 'లిటిల్ హార్ట్స్','బ్రోమాన్స్ చిత్రాలకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మలయాళంతో పాటు తమిళ చిత్రాలలోనూ నటించిన ఆమె ఇప్పుడు తెలుగులో అడుగుపెడుతోంది.;
ప్రస్తుతం మలయాళంలో మంచి సినిమాలు చేస్తూ వరుస విజయాలు అందుకుంటున్న నటి మహిమా నంబియార్. ఈమె ఇప్పుడు తెలుగులోకి అడుగుపెడుతోంది. తన మొదటి తెలుగు చిత్రంలో శ్రీవిష్ణు సరసన నటించనుంది. ఈమె మలయాళంలో నటించిన 'ఆర్‌డీఎక్స్', 'జై గణేష్' , 'లిటిల్ హార్ట్స్','బ్రోమాన్స్ చిత్రాలకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మలయాళంతో పాటు తమిళ చిత్రాలలోనూ నటించిన ఆమె ఇప్పుడు తెలుగులో అడుగుపెడుతోంది.
జనకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో, శ్రీవిష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమాని 'స్కంద వాహన మోషన్ పిక్చర్స్' బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మహిమా నంబియార్ నటిస్తోంది. ఈ సినిమా టైటిల్‌ను దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 2న ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది. ఇటీవల 'సింగిల్' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శ్రీవిష్ణు, వరుసగా కొత్త ప్రాజెక్టులను ఒప్పుకుంటున్నారు.