'ది ప్యారడైజ్' కోసం అనిరుధ్ రెమ్యునరేషన్!

Update: 2025-03-06 03:39 GMT
ది ప్యారడైజ్ కోసం అనిరుధ్ రెమ్యునరేషన్!
  • whatsapp icon

ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో అనిరుధ్ ఒకడు. పాటల కంటే ఎక్కువగా అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు భారీ డిమాండ్ ఉంది. అనిరుధ్ సంగీతం అంటే సినిమాపై అంచనాలు గణనీయంగా పెరుగుతున్నాయి. లేటెస్ట్ గా తెలుగులో అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్న చిత్రాలలో 'ది ప్యారడైజ్' ఒకటి.

ఇటీవల విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ కి మంచి ఆదరణ దక్కింది. నేచురల్ స్టార్ నాని మేకోవర్, శ్రీకాంత్ ఓదెల రస్టిక్ నేరేషన్ లతో పాటు ఈ గ్లింప్స్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది అనిరుధ్ బి.జి.ఎమ్. ఇక 'ది ప్యారడైజ్' కోసం అనిరుధ్ తీసుకుంటోన్న రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

గతంలో 'దేవర' సమయంలో అనిరుధ్ ఒక్కో సినిమాకు 10 నుంచి 12 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నాడని టాక్ ఉంది. అయితే నాని సినిమా కోసం ఏకంగా రూ.14 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్టుగా ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనం. మొత్తంగా.. ఇండియాలోని మ్యూజిక్ డైరెక్టర్స్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే జాబితాలో అనిరుధ్ పేరు ఖచ్చితంగా ముందు వరుసలో నిలుస్తుంది.

Tags:    

Similar News