మాస్క్ తీసిన ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ స్టాఫ్ సభ్యుడు అతను పెద్ద సినీ స్టార్ అని చెప్పినప్పటికీ.. సెక్యూరిటీ బృందం నిబంధనలను పాటిస్తూ మాస్క్ తీయకుండా అనుమతించలేదు.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో ఊహించని సంఘటనను ఎదుర్కొన్నాడు. మాస్క్ ధరించిన అతడ్ని సెక్యూరిటీ సిబ్బంది చెక్‌పాయింట్ వద్ద ఆపి, గుర్తింపు కోసం మాస్క్ తీయమని కోరారు. అల్లు అర్జున్ స్టాఫ్ సభ్యుడు అతను పెద్ద సినీ స్టార్ అని చెప్పినప్పటికీ.. సెక్యూరిటీ బృందం నిబంధనలను పాటిస్తూ మాస్క్ తీయకుండా అనుమతించలేదు.
ఒక సహ ప్రయాణికుడు ఈ చిన్న సంఘటనను వీడియోలో రికార్డ్ చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్యాన్స్ కామెంట్స్‌తో రెచ్చిపోయారు. కొందరు పాన్ ఇండియా స్టార్‌ను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించకపోవడం ఫన్నీగా భావించగా.. మరికొందరు నిష్పక్షపాతంగా నిబంధనలు పాటించిన సెక్యూరిటీ సిబ్బందిని ప్రశంసించారు.
ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సై-ఫై సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆల్లు అర్జున్, ఈ సంఘటనను స్పోర్టివ్‌గా తీసుకొని.. చెక్ పూర్తయ్యాక తన ప్రయాణం కొనసాగించాడు. షూటింగ్ ముంబైలో జరుగుతుండటంతో, అతను ముంబై-హైదరాబాద్ మధ్య తరచూ ప్రయాణిస్తున్నాడు.