నెక్స్ట్ షెడ్యూల్ అబుదాబిలో

ముంబైలో ఈ చిత్రం ఒక భారీ షెడ్యూల్ 50 రోజుల పాటు జరిగి ముగిసింది. తదుపరి షెడ్యూల్ అక్టోబర్‌లో అబుదాబిలో ప్రారంభం కానుంది. దీన్ని ఈ చిత్రంలో అతి పెద్ద షెడ్యూల్‌గా చెప్పుకోవచ్చు.;

By :  K R K
Update: 2025-09-15 01:30 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఒక భారీ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇది అంతర్జాతీయ స్థాయిలో విడుదల కానుంది. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ చిత్రంలో భారతీయ సినిమా రంగంలోని ప్రముఖ నటీమణులు, పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు పాల్గొంటున్నారు. ముంబైలో ఈ చిత్రం ఒక భారీ షెడ్యూల్ 50 రోజుల పాటు జరిగి ముగిసింది. తదుపరి షెడ్యూల్ అక్టోబర్‌లో అబుదాబిలో ప్రారంభం కానుంది. దీన్ని ఈ చిత్రంలో అతి పెద్ద షెడ్యూల్‌గా చెప్పుకోవచ్చు.

ఈ షెడ్యూల్‌లో ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఈ షెడ్యూల్‌లో సెట్స్‌పై చేరనుంది. ముంబై షెడ్యూల్‌లో మృణాళ్ ఠాకూర్, రమ్యకృష్ణ ఇప్పటికే చిత్రీకరణలో పాల్గొన్నారు. అలాగే రష్మిక మందన్న అండ్ జాన్వీ కపూర్ అబుదాబి షెడ్యూల్‌లో చేరనున్నట్లు సమాచారం.

ఈ షెడ్యూల్ బ్రేక్ సమయంలో అల్లు అర్జున్ చిత్రం వీఎఫ్ఎక్స్ పనులను పర్యవేక్షించడానికి అమెరికాకు వెళ్లనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తవుతుందని, 2027లో ఈ చిత్రం విడుదల కానుందని నివేదికలు చెబుతున్నాయి. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాకు సన్ పిక్చర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Tags:    

Similar News