నాలుగేళ్ళ తర్వాత మళ్లీ తండ్రీకొడుకుల కాంబో ?
షూటింగ్ ఇంకా మొదలుకాకముందే, ఈ సినిమాలో నటించబోయే తారల గురించి ఊహాగానాలు జోరుగా విని పిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, డైరెక్టర్ పురి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పురి కూడా ఈ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది.;
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం ప్రారంభం కానుంది అనే విషయం తెలిసిందే. ఈ వెరైటీ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. షూటింగ్ ఇంకా మొదలుకాకముందే, ఈ సినిమాలో నటించబోయే తారల గురించి ఊహాగానాలు జోరుగా విని పిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, డైరెక్టర్ పురి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పురి కూడా ఈ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది.
గ్రే షేడ్స్ ఉన్న ఒక కీలక పాత్రలో ఆకాష్ కనిపించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది నిజమైతే.. 2021లో వచ్చిన ‘రొమాంటిక్’ తరువాత తండ్రీకొడుకులు కాంబోలో మరో సినిమా ఇదే కావడం విశేషం. ఇప్పటివరకు హీరోగా ఆకాష్‌కు పెద్దగా బ్రేక్ రాలేదు. ఇప్పుడు తన తండ్రి రూపొందిస్తున్న ఈ బిగ్ ప్రాజెక్టులో ఆకాష్‌కు ఒక మెమరబుల్ క్యారెక్టర్ ఇస్తారా అన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది.
ఈ చిత్రం ప్రస్తుతానికి ‘బెగ్గర్’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలువబడుతోంది. ఇది పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోంది. ఇప్పటికే టబు, దునియా విజయ్, నివేతా థామస్ వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్, తారాగణం, సాంకేతిక బృందం వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.