తమిళ చిత్రానికి సైన్ చేసిన శోభిత ధూళిపాళ
చెన్నై మీడియా సమాచారం ప్రకారం.. శోభిత ఒక తమిళ చిత్రంలో నటించడానికి సంతకం చేసింది. ఈ చిత్రంలో ఆమె ఆర్య, దినేష్ రవి సరసన నటిస్తోంది.;
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఇద్దరూ రెండు సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత డిసెంబర్ 2024లో ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల.. ఒక స్టోర్ ప్రారంభోత్సవంలో ఈ అందమైన జంట కలిసి కనిపించడంతో.. అభిమానుల నుండి వారికి చాలా ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో పెళ్లైన దాదాపు పది నెలల తర్వాత.. శోభిత తిరిగి సినిమా సెట్స్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
చెన్నై మీడియా సమాచారం ప్రకారం.. శోభిత ఒక తమిళ చిత్రంలో నటించడానికి సంతకం చేసింది. ఈ చిత్రంలో ఆమె ఆర్య, దినేష్ రవి సరసన నటిస్తోంది. పా. రంజిత్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి "వెట్టువం" అనే టైటిల్‌ను నిర్ణయించారు. శోభిత ఇంతకుముందు మణిరత్నం "పొన్నియిన్ సెల్వన్" వంటి తమిళ చిత్రాలలో కనిపించినప్పటికీ.. కథానాయికగా ఆమెకు ఇది మొదటి చిత్రం అవుతుంది.
నాగ చైతన్య, శోభిత ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా తన నటన జీవితాన్ని కొనసాగించాలనే తన ఉద్దేశాన్ని ఆమె గతంలో వ్యక్తం చేసింది. కానీ వివాహం తర్వాత ఆమె తన మొదటి సినిమాకు సంతకం చేయడానికి ఇంత సమయం పట్టింది.