సుహాస్ అదరగొడుతున్నాడు!
వెట్రిమారన్ సినిమాల్లో పాత్రలు ఎంత బలంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘మండాడి’ లో టాలీవుడ్ యువ నటుడు సుహాస్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.;
వెట్రిమారన్ సినిమాల్లో పాత్రలు ఎంత బలంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘మండాడి’ లో టాలీవుడ్ యువ నటుడు సుహాస్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సుహాస్ మరియు కోలీవుడ్ యాక్టర్ సూరి ఉగ్రరూపంలో దర్శనమిచ్చారు. సముద్రపు మధ్యలో ఘర్షణకు సిద్ధంగా ఉన్న వీరిద్దరి లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ సినిమా దృశ్యపరంగా రా & రస్టిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ‘సెల్ఫీ’ ఫేమ్ మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తుండగా, ఎల్‌రెడ్ కుమార్ ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సత్యరాజ్, మహిమా నంబియార్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్, సచ్చనా నమిదాస్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతాన్ని జీవీ ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు.
తెలుగు ప్రేక్షకుల్ని ప్రత్యేకంగా ఆకర్షించేందుకు ‘మండాడి’కు సంబంధించిన తెలుగు ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం విశేషం. ‘మీ పోరాట స్ఫూర్తిని మేల్కొల్పడానికి ఒక సునామీ చాలు‘’ అనే క్యాప్షన్‌తో ఈ పోస్టర్ రిలీజ్ చేయడం సినిమాపై అంచనాలను పెంచుతోంది.