'స్పిరిట్' స్క్రిప్ట్ లాక్ – ప్రభాస్ ఫోటోషూట్‌కు రెడీ!
'స్పిరిట్' స్క్రిప్ట్ లాక్ – ప్రభాస్ ఫోటోషూట్‌కు రెడీ!రెబెల్ స్టార్ ప్రభాస్ కిట్టీలో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నా 'స్పిరిట్' చిత్రానికి మాత్రం కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ‘యానిమల్’ హిట్‌తో టాప్ ఫాంలో ఉన్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడనే హింట్ కూడా ఇప్పటికే వచ్చింది. దీంతో ఫస్ట్ టైమ్ ప్రభాస్ పోలీస్ రోల్ లో కనిపించబోతున్న 'స్పిరిట్' మూవీపై అంచనాలు ఓ రేంజులో ఉన్నాయి.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాని మే నెల నుంచి పట్టాలెక్కిస్తాడట సందీప్. ఇప్పటికే 'స్పిరిట్' స్క్రిప్ట్ లాక్ కాగా, ప్రభాస్ లుక్ కోసం కొన్ని స్కెచ్‌లు రెడీ అయ్యాయట. ప్రయర్ కమిట్‌మెంట్స్ నుంచి ప్రభాస్ ఫ్రీ అవ్వగానే ఓ స్పెషల్ ఫోటో షూట్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నాడట సందీప్.
ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ క్యారెక్టర్‌ను ఎంతో రస్టిక్ గా డిజైన్ చేశాడట సందీప్ రెడ్డి. యాక్షన్ ఎపిసోడ్స్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటాయట. హీరోయిన్లుగా మృణాల్ లేదా రష్మిక లను పరిశీలిస్తున్నారని.. కీలక పాత్రల్లో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ నటించనున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకోసం 'అర్జున్ రెడ్డి, యానిమల్' ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ కంపోజింగ్‌ను మొదలుపెట్టాడు. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.