కెజీఎఫ్’ హీరోతో ‘సర్దార్’ దర్శకుడు ?

మిత్రన్ యష్ కోసం ఒక ప్రయోగాత్మక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ను సిద్ధం చేశారని తెలుస్తోంది. అయినప్పటికీ, ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించబడే వరకు అభిమానులు వేచి ఉండక తప్పదు.;

By :  K R K
Update: 2025-10-05 01:08 GMT

శాండల్‌వుడ్ స్టార్ యష్ ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు పాన్-ఇంటర్నేషనల్ భారీ చిత్రాలు 'ట్యాక్సిక్, రామాయణ' లో నటిస్తు్న్న సంగతి తెలిసిందే. 'ట్యాక్సిక్' అనేది గ్యాంగ్‌స్టర్ డ్రామా. ఇది వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానుంది, కాగా 'రామాయణ' పార్ట్ 1 మరియు పార్ట్ 2 ప్రపంచ వ్యాప్తంగా వరుసగా దీపావళి 2026 మరియు దీపావళి 2027 న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇంక అసలు విషయానికొస్తే.. తమిళ అగ్ర దర్శకుడు పిఎస్ మిత్రన్‌తో యష్ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుపుతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. కోలీవుడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం, మిత్రన్ యష్ కోసం ఒక ప్రయోగాత్మక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ను సిద్ధం చేశారని తెలుస్తోంది. అయినప్పటికీ, ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించబడే వరకు అభిమానులు వేచి ఉండక తప్పదు.

అంతా అనుకున్నట్టు జరిగితే.. యష్-మిత్రన్ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన తర్వాత, యష్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కెజిఎఫ్ చాప్టర్ 3' కోసం ప్రశాంత్ నీల్‌తో తిరిగి జతకట్టనున్నారు. పీయస్ మిత్రన్ ప్రస్తుతం కార్తి హీరోగా ‘సర్దార్ 2’ చిత్రం హడావిడిలో ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత.. యశ్ మూవీ స్టార్ట్ అవుతుందని సమాచారం. 

Tags:    

Similar News