రెండు పెద్ద సినిమాలతో రెడీ అవుతోన్న రష్మిక
వరుస విజయాలతో మంచి జోరుమీదుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీస్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి లేట్ చేయకుండా.. విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఆమె తాజాగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం “ఛావా”. ఈ మూవీలో శంభాజీ మహారాజ్ భార్యగా నటించి మెప్పింది. అందులోని తన నటనకు రష్మిక విశేషంగా ప్రశంసలు అందుకుంటోంది. అంతకు ముందు, “పుష్ప 2”తో సంచలన విజయాన్ని నమోదు చేసింది.
అయితే .. ఇటీవల కాలంలో కాలుకు గాయమవడంతో.. రష్మిక నటించే కొన్ని పెద్ద ప్రాజెక్టుల షూటింగ్‌కు బ్రేక్ పడింది. దీనివల్ల విడుదల తేదీలు మారాయి. అయినప్పటికీ.. ఆమె తదుపరి భారీ చిత్రం “సికిందర్” మాత్రం సరైన సమయానికి విడుదలకానుంది. రంజాన్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం రెడీ అవుతోంది.
“సికిందర్” చిత్రంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్‌లో థియేటర్లలో సందడి చేయనుంది. త్వరలోనే రష్మిక షూటింగ్‌కి తిరిగి వెళ్లి.. తన పార్ట్ కంప్లీట్ చేయనుంది. అంతేకాకుండా.. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న “కుబేర” చిత్రం పనులు కూడా ఆమె గాయంతో తాత్కాలికంగా నిలిచిపోయాయి. ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పోస్ట్-సమ్మర్ రిలీజ్‌కి వెళుతోంది. రష్మిక వచ్చే రెండు నెలల్లో “సికిందర్”, “కుబేర” షూటింగ్‌లను పూర్తి చేసి, తన ప్రాజెక్ట్‌లను పూర్తి చేసుకునేందుకు సిద్ధమవుతోంది.