'జూనియర్' వేడుకలో రాజమౌళి
పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘జూనియర్’. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రజనీ కొర్రపాటి నిర్మించగా, శ్రీలీల కథానాయికగా నటించింది. జెనీలియా ముఖ్యపాత్రలో కనిపించనుంది.;
పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘జూనియర్’. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రజనీ కొర్రపాటి నిర్మించగా, శ్రీలీల కథానాయికగా నటించింది. జెనీలియా ముఖ్యపాత్రలో కనిపించనుంది. రేపు (జూలై 18) ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, 'చిన్న సినిమాగా మొదలై 'జూనియర్' పెద్ద సినిమా అయ్యింది. వెయ్యికి పైగా స్క్రీన్లలో విడుదలవ్వడం సినిమాపై ఆసక్తిని చూపిస్తోంది. జెనీలియా ఇప్పటికీ అదే చిరునవ్వుతో మెరుస్తోంది. దర్శకుడు రాధాకృష్ణ, నిర్మాత సాయి కొర్రపాటికి అభినందనలు.' అని తెలిపారు. అలాగే సెంథిల్, పీటర్ హెయిన్స్ కృషిని రాజమౌళి ప్రత్యేకంగా ప్రశంసించారు.
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, 'ఈ చిత్రం కిరీటికి 'ఆర్య' లాంటి బ్రేక్ ఇస్తుంది' అనగా.. శ్రీలీల మాట్లాడుతూ, 'వైరల్ వయ్యారి ట్యాగ్ నాకు రావడానికి కారణం దేవిశ్రీ ప్రసాద్. జెనీలియా ఓ బ్రాండ్. కిరీటి నిజంగా ఓ స్టార్ అవుతాడు' అని తెలిపింది.