‘ఉస్తాద్..‘లోకి రాశీ ఎంట్రీ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో నటి రాశీ ఖన్నా కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో జాయిన్ అయినట్టు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. రాశీ ‘శ్లోక’ అనే పాత్రలో ఫోటోగ్రఫీ జర్నలిస్టుగా కనిపించనుంది.
రాశీ పాత్రకు కథలో ప్రత్యేక స్థానం ఉందని మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జోరుగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్‌తో పాటు ప్రధాన తారాగణం ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. పూజా హెగ్డేను మొదట హీరోయిన్‌గా అనుకున్నా, డేట్స్ సరిచేయలేకపోవడంతో శ్రీలీలను తీసుకున్నారు. ఇప్పుడు మరో కథానాయికగా రాశి ఖన్నా ఎంట్రీ ఇవ్వడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మళ్లీ పవన్ – హరీష్ శంకర్ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ప్లాన్ లో ఉందట టీమ్.