'ఎల్లమ్మ' కోసం నితిన్ ప్రయోగం!
‘బలగం’ సూపర్ సక్సెస్ తర్వాత వేణు యెల్దండి రెండో సినిమాగా ‘ఎల్లమ్మ’ను తీర్చిదిద్దుతున్నాడు. ఈ సినిమాలో హీరోగా నితిన్ నటించనున్నాడు.;
‘బలగం’ సూపర్ సక్సెస్ తర్వాత వేణు యెల్దండి రెండో సినిమాగా ‘ఎల్లమ్మ’ను తీర్చిదిద్దుతున్నాడు. ఈ సినిమాలో హీరోగా నితిన్ నటించనున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవల నితిన్‌తో ‘తమ్ముడు’ సినిమా చేశారు దిల్‌రాజు. అయితే.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అపజయం పాలైంది. దాంతో ‘ఎల్లమ్మ’ చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌తో, లాభాలను పంచుకునే పద్ధతిలో రూపొందించాలనే నిర్ణయానికి దిల్ రాజు వచ్చారని సమాచారం. ఇందులో భాగంగా నితిన్ రెమ్యునరేషన్ తీసుకోకుండా, సినిమాకు వచ్చే లాభాల్లో షేర్ తీసుకోవాలని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్న ఈ మూవీ సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభించుకునే అవకాశం ఉంది. వరుసగా ఫ్లాపులు అందుకుంటున్న నితిన్‌కు, వేణుతో చేస్తున్న ప్రయోగాత్మక సినిమా 'ఎల్లమ్మ' హిట్ ఇస్తుందేమో చూడాలి.