షేన్ నిగమ్ ‘బాల్టీ’ మూవీ వచ్చేది అప్పుడే !

షేన్ నిగమ్ నటించిన ‘బాల్టీ’ కూడా ఆగస్టు 29 న ఓణం సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు ఉన్ని శివలింగం తెరకెక్కించారు.;

By :  K R K
Update: 2025-07-19 01:40 GMT

మోహన్‌లాల్‌ నటించిన ‘హృదయపూర్వం’, ఫహద్ ఫాసిల్‌ నటించిన ‘ఓడుం కుతిర చాడుం కుతిర’ చిత్రాలతో పాటు.. షేన్ నిగమ్ నటించిన ‘బాల్టీ’ కూడా ఆగస్టు 29 న ఓణం సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు ఉన్ని శివలింగం తెరకెక్కించారు. సంతోష్ టి కురువిల్లా, బిను అలెగ్జాండర్ జార్జ్ నిర్మించారు. కబడ్డీ ఆధారిత స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అయిన బాల్టిలో షేన్ ఉదయన్ అనే కబడ్డీ ఆటగాడి పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమాను మలయాళం, తమిళంలో చిత్రీకరించారు. ప్రీతి అస్రాని హీరోయిన్‌గా నటిస్తోంది. దర్శకుడు అల్ఫోన్స్ పుత్రెన్ ‘సోడాబాబు’ అనే క్రూరమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తారు. తమిళ నటుడు శాంతను భాగ్యరాజ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాక, ఈ చిత్రంలో జాతీయ, రాష్ట్ర స్థాయి కబడ్డీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. తమిళ సినిమాల్లో ప్రస్తుతం డిమాండ్‌లో ఉన్న సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ బాల్టితో మలయాళంలోకి అడుగుపెడుతున్నాడు. సినిమాకు సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.

‘కిల్, ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ చిత్రాలకు పనిచేసిన శివకుమార్ వి పనిక్కర్ ఈ సినిమాకు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. షేన్ నటించిన ‘ఆర్‌డిఎక్స్’ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన అలెక్స్ జె పులిక్కల్ ఈ చిత్రానికి కూడా కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బాల్టితో పాటు, షేన్ ఇంకా.. కొందరు ఇతర కొత్త దర్శకుల సినిమాల్లో కూడా నటిస్తున్నారు. వీరా దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామా ‘హాల్’ తదుపరి విడుదల కానుంది. అలాగే, రోష్ రషీద్ దర్శకత్వంలో ‘ఎల్ క్లాసికో’ ఇంకా.. జీతు జోసెఫ్ మాజీ అసిస్టెంట్ మార్టిన్ జోసెఫ్‌తో ఓ సినిమా కూడా ఉన్నాయి.


Tags:    

Similar News