'మిరాయ్' మానియా స్టార్ట్!

తేజ సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన పాన్-ఇండియా ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ ‘మిరాయ్’. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.;

By :  S D R
Update: 2025-09-06 16:27 GMT

తేజ సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన పాన్-ఇండియా ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ ‘మిరాయ్’. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, గ్లింప్స్‌తోనే ఈ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయింది.

ఈ చిత్రంలో తేజ సజ్జా సూపర్ హీరోగా కనిపించగా, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పూర్తి స్థాయి విలన్ బ్లాక్ స్వార్డ్ పాత్రలో అలరించనున్నాడు. కథలో ‘మిరాయ్’ అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. తొమ్మిది పవిత్ర గ్రంథాలను పొందితే విలన్ సంపూర్ణ రావణుడిగా మారిపోతాడు. అతన్ని ఆపే శక్తి ఆ ‘మిరాయ్’ స్టిక్‌కే ఉందన్న కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందినట్టు ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

జగపతిబాబు, శ్రియా శరణ్, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. సినిమా కోసం టీమ్ శ్రీలంక, నేపాల్, రాజస్థాన్, థాయిలాండ్ వంటి దేశాల్లో రియల్ లొకేషన్లలో షూట్ చేయడం విశేషం. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు, టాప్-నాచ్ VFX, విస్తృతమైన కాన్వాస్‌తో ఈ చిత్రం ప్రేక్షకులకు వింతైన అనుభూతిని అందించబోతోందని నమ్ముతుంది టీమ్.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. గౌర హరి అందించిన మ్యూజిక్, బి.జి.ఎమ్. కూడా టెక్నికల్ గా ఈ మూవీని మరో లెవెల్ లో నిలపనున్నాయట. ఇక ప్రస్తుతం బుక్ మై షోలోనే 100K+ ప్రేక్షకులు ఈ సినిమాపై ఆసక్తి చూపించడం ద్వారా 'మిరాయ్'పై ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

Tags:    

Similar News