'మిరాయ్' కాంబో మళ్లీ రిపీట్
‘హనుమాన్’తో పాన్ ఇండియా హిట్ అందుకున్న తేజ సజ్జా, ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న 'మిరాయ్' షూటింగ్ పూర్తి చేసుకుంది.;
‘హనుమాన్’తో పాన్ ఇండియా హిట్ అందుకున్న తేజ సజ్జా, ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న 'మిరాయ్' షూటింగ్ పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ లో ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
లేటెస్ట్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీలోనే మరో మూవీకి కమిట్ అయ్యాడు తేజ. ఈ యంగ్ హీరోతో రెండో సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సర్ప్రైజ్ ఇచ్చింది. 'గతంలో లేనంత బలంగా.. ఎప్పుడూ లేనంత క్రూరంగా' అనే ట్యాగ్‌లైన్‌తో ఈ ప్రాజెక్ట్‌ను కన్ఫర్మ్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. అలాగే.. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు పోస్టర్ లో తెలిపింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.
తేజ సజ్జ-పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబోలో రూపొందే రెండో చిత్రానికి దర్శకుడు ఎవరు? అనేది ప్రకటించలేదు. అయితే.. ఈ సినిమా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రూపొందనుందనే ప్రచారం జరుగుతుంది. గతంలో ప్రశాంత్-తేజ కాంబోలో హిట్టైన 'జాంబిరెడ్డి'కి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కనుందనేది ఫిల్మ్ నగర్ టాక్.