‘ది ప్యారడైజ్‘ను కలవరపెడుతున్న లీకులు
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కలయికలో రూపొందుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’.;
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కలయికలో రూపొందుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’.‘దసరా‘తో నానికి వంద కోట్ల చిత్రాన్ని అందించిన శ్రీకాంత్ ఓదెల.. ‘ది ప్యారడైజ్‘ కోసం నేచురల్ స్టార్ ని మరింత రస్టిక్ గా ఆవిష్కరించబోతున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. నానిపై కీలకమైన యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తుంది టీమ్.
ఈ సెట్ నుంచి కొన్ని ఫొటోలు లీక్ కావడం చిత్రబృందాన్ని కలవరపెడుతుంది. ముఖ్యంగా ఓ జైలు సెట్‌లో మోహన్ బాబు ఫొటో కనిపించడంతో కథకు సంబంధించి కీలక వివరాలు ముందే బయటపడినట్లయింది. ఇప్పటికే వెటరన్ యాక్టర్ మోహన్ బాబు ఈ చిత్రంలో నటిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఈ లీక్డ్ ఫోటోతో అది కన్ఫమ్ అయ్యింది.
ఇంకా ఈ సినిమాలో ‘కిల్’ ఫేమ్ రాఘవ జుయాల్ విలన్ గా కనిపించబోతున్నాడు. కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న పలు భాషల్లో ‘ది ప్యారడైజ్‘ విడుదలకు ముస్తాబవుతుంది.