'కొత్తపల్లిలో ఒకప్పుడు' ట్రైలర్‌

సరికొత్త కాన్సెప్ట్‌లకు ఆదరణ పెరుగుతున్న తెలుగు చిత్రసీమలో మరో విలేజ్ డ్రామా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రానా దగ్గుబాటి సమర్పణలో, ప్రవీణ పరుచూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ జూలై 18న విడుదలకు ముస్తాబవుతుంది.;

By :  S D R
Update: 2025-07-10 09:05 GMT

సరికొత్త కాన్సెప్ట్‌లకు ఆదరణ పెరుగుతున్న తెలుగు చిత్రసీమలో మరో విలేజ్ డ్రామా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రానా దగ్గుబాటి సమర్పణలో, ప్రవీణ పరుచూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ జూలై 18న విడుదలకు ముస్తాబవుతుంది. ఇప్పటికే టీజర్ తో ఆకట్టుకున్న ఈ మూవీ నుంచి ట్రైలర్ వచ్చింది.

ఓ చిన్న గ్రామంలో డ్యాన్స్ మాస్టర్ రామకృష్ణ ప్రేమకథగా మొదలైన కథ, ఊహించని మలుపులతో మిస్టీరియస్ గా మారబోతున్నట్టు ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఈ ట్రైలర్ ఆద్యంతం విలేజ్ ఫ్లేవర్ తో పాటు కామెడీ, లవ్, మిస్టరీ, హారర్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ‘కేరాఫ్ కంచెరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి హిట్ సినిమాలను అందించిన ప్రవీణ ఈసారి దర్శకురాలిగా మారడం విశేషం.

ఈ సినిమాలో మనోజ్ చంద్ర, మోనిక టి, ఉషా బోనె పరిచయమవుతుండగా.. రవీంద్ర విజయ్, బెనర్జీ, బొంగు సత్తి, ఫణి, ప్రేమ్ సాగర్ కీలక పాత్రలు పోషించారు. విభిన్న కథనంతో గ్రామీణ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.


Full View


Tags:    

Similar News