'కొత్తపల్లిలో ఒకప్పుడు' టీజర్ రిలీజ్

చిన్న చిత్రంగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది 'కేరాఫ్ కంచరపాలెం'. ఈ సినిమాను నిర్మించిన ప్రవీణ పరుచూరి, రానా దగ్గుబాటి మరోసారి చేతులు కలిపారు.;

By :  S D R
Update: 2025-07-04 15:00 GMT

చిన్న చిత్రంగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది 'కేరాఫ్ కంచరపాలెం'. ఈ సినిమాను నిర్మించిన ప్రవీణ పరుచూరి, రానా దగ్గుబాటి మరోసారి చేతులు కలిపారు. ఈసారి ప్రవీణ పరుచూరి దర్శకుడిగా మారి 'కొత్తపల్లిలో ఒకప్పుడు' అనే గ్రామీణ నేపథ్యంలో సాగే భావోద్వేగ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని రానాతో కలిసి నిర్మించారు.

లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ రిలీజయ్యింది. 'కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు రికార్డింగ్ స్టూడియో నడుపుతుంటాడు. ఆ యువకుడికి డ్యాన్సర్ అవసరం పడుతుంది. ఆ వెతుకులాటలో ఒక అమ్మాయి వెంట పడుతుండగా, ఊరి జనాలు అతనిపై అనుమానాలు పెంచుకుంటారు. ఈ నేపథ్యంతో ఫుల్ లెన్త్ కామెడీతో ఈ సినిమా రూపొందినట్టు టీజర్ ను బట్టి తెలుస్తోంది.

బెనర్జీ గ్రామ పెద్దగా, కొత్త నటీనటులు మనోజ్ చంద్ర, మోనిక, ఉషా బోనేలా ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమాటోగ్రఫీకి లాస్ ఏంజెల్స్‌కి చెందిన అవార్డ్ విన్నర్ పనిచేయడం విశేషం. 'కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' తరహాలో రియలిస్టిక్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రాబోతున్నట్టు టీజర్ ను బట్టి తెలుస్తోంది. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తుండటం విశేషం. జూలై 18న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.


Full View


Tags:    

Similar News